Thursday, December 29, 2011

ఏపీపీఎస్ సీ ఉద్యోగ ప్రకటనల జోరు!

నేటివరకూ 19 ఉద్యోగ ప్రకటనల జారీ

ఇవాళ ఈనాడు లో వచ్చిన ఈ వార్త చూడండి.....

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఏపీపీఎస్సీ మరో 2602 పోస్టులతో ఏడు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది.

మంగళవారం 2805 పోస్టులతో పది ప్రకటనలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 132 లెక్చరర్ల పోస్టులు, 15 సహాయ అటవీ సంరక్షణ అధికారుల పోస్టులకు ప్రకటనలు జారీ చేశారు. రెండు రోజుల్లో మొత్తం 5,454 పోస్టులతో 19 ఉద్యోగ ప్రకటనలు జారీ అయ్యాయి.

బుధవారం జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో గ్రూప్‌-4 పోస్టులు 2,146 ఉన్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఉద్యోగ ప్రకటనలతో పాటు దరఖాస్తు స్వీకరణ, రాత పరీక్షల తేదీలు ప్రకటించారు.

ప్రకటనలకు సంబంధించిన అర్హతలు, జోన్లవారీ ఖాళీల వివరాలు www.apspsc.gov.inలో లభిస్తాయి.

Otixo - వివిధ ఆన్ లైన్ స్టోరేజ్ అకౌంట్లను ఒకేచోటనుండి యాక్సెస్ చెయ్యటానికి!

వివిధ ఆన్ లైన్ స్టోరేజ్ సర్వీసెస్ అయిన డ్రాప్ బాక్స్, గూగుల్ డాక్స్, సుగర్ సింక్, బాక్స్.నెట్, FTP మొదలగు వాటిని ఒకే చోట నుండి యాక్సెస్/మేనేజ్ చెయ్యటానికి Otixo అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. ఇక్కడ అన్ని అకౌంట్లను ఒకేసారి యాక్సెస్ చెయ్యవచ్చు మరియు అవసరమైతే్ ఒక సర్వీస్ నుండి ఫైళ్ళను మరొక దానిలోకి కాపీ / పేస్ట్ చెయ్యవచ్చు.




Otixo సైట్ కి వెళ్ళి ముందుగా సైన్-అప్ చెయ్యాలి. లాగిన్ అయిన తర్వాత కావలసిన క్లౌడ్ సర్వీస్ ని ఎంచుకొని దానిని Authorize చెయ్యవలసి ఉంటుంది.  ఒకటి కన్నా ఎక్కువ క్లౌడ్ సర్వీసెస్ ఉన్న వారికి ఈ ఆన్ లైన్ అప్లికేషన్ బాగా ఉపయోగపడుతుంది. 





వెబ్ సైట్: Otixo



ధన్యవాదాలు

Zwiggo - కావలసిన వారితో ఏదైనా సులభంగా షేర్ చేసుకోవటానికి!!

Zwinggo - The Easiest way to share anything in Groups




Welcome to Zwiggo from Zwiggo on Vimeo.




Website: Zwinggo

AnyMeeting - ఆన్ లైన్ వెబ్ కాన్ఫరెన్సింగ్ సర్వీస్!

AnyMeeting అనే ఉచిత ఆన్‍లైన్ వెబ్ సర్వీసింగ్ ని ఉపయోగించి కొలీగ్స్ లేదా మిత్రుల గుంపు తో ఆన్ లైన్ లో మీటింగ్ మరియు కాన్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చు.  ముందుగా ఈ సైట్ కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి లేదా ఫేస్ బుక్ అకౌంట్ తో కూడా సైన్-అప్ చెయ్వవచ్చు.  ఒకసారి ఈ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత AnyMeeting డాష్ బోర్డ్ కి రీడైరెక్ట్ చెయ్యబడుతుంది. అక్కడ Start Webinar మరియు Schedule Webinar అనే రెండు బటన్లు ఉంటాయి. కావలసిన దానిపై క్లిక్ చెయ్యాలి. వెంటనే మీటింగ్ స్టార్ట్ చెయ్యాలంటే కనుక Start Webinar పై క్లిక్ చెయ్యాలి. వెబినార్ లో పాల్గొనే వారికి AnyMeeting URL ని  ఈ-మెయిల్/ఐఎమ్/ సోషల్ నెట్వర్క్ ద్వారా మెసేజ్ పంపవచ్చు. గరిష్టంగా 200 మంది వరకు మీటింగ్ లో పాల్గొనవచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్, స్క్రీన్ షేరింగ్,  టెక్స్ట్ మెసేజింగ్, రికార్డిండ్, పోలింగ్, సర్వే మొదలగునవి దీని ప్రత్యేకతలు.  

మరింత సమాచారం కోసం http://www.anymeeting.com/ సైట్ చూడండి.






వెబ్ సైట్: http://www.anymeeting.com/


ధన్యవాదాలు

badongo - ఉచిత అన్ లిమిటెడ్ ఆన్ లైన్ స్టోరేజ్!





గణిత మేధావి Srinivasa Iyengar Ramanujan పుట్టిన రోజు ఈ రోజు (22-12-1887)


********


badongo.com  ఉచిత అన్ లిమిటెడ్ స్టోరేజ్ ని అందిస్తుంది.  ఫోటోస్, మ్యూజిక్, వీడియోస్ ఏదైనా ఫైల్  ఎటువంటి సైజ్ పరిమితి లేకుండా ఆన్ లైన్ లో స్టోర్ చేసుకోవచ్చు మరియు మేనేజ్ కూడా చెయ్యవచ్చు. అంతేకాకుండా లాగిన్ అకౌంట్ సహాయంతో డాటా ని ఎప్పుడైనా ఎక్కడినుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు.  ఆన్ లైన్ లో స్టోర్ చెయ్యబడిన ఫైళ్ళ టెక్స్ట్ లింక్ ని అవసరమైన వారితో మెయిల్ లేదా ఫేస్ బుక్ లలో షేర్ చేసుకోవచ్చు.  వ్యక్తిగత ఫైళ్ళను పాస్ వార్డ్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. 






అయితే ఉచిత అకౌంట్ లో కొన్ని పరిధులు ఉన్నాయి రోజుకి 12 GB  వరకు డాటా ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఇన్-యాక్టివ్ ఫైల్స్ 90 రోజుల తర్వాత తొలగించబడతాయి. ఉచిత అకౌంట్ కి మరియు ఇతర అకౌంట్ల తేడా ఇక్కడ చూడండి.




వెబ్ సైట్: http://www.badongo.com/



ధన్యవాదాలు



DoIHaveADeadPixel - మోనిటర్ లో డెడ్ పిక్సెల్స్ తెలుసుకోవటానికి!

పీసీ మోనిటర్ లో డిఫెక్టివ్/ డెడ్ పిక్సెల్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి DoIHaveADeadPixel అనే ఉచిత ఆన్ లైన్ యుటిలిటీ ఉపయోగపడుతుంది. 




 మోనిటర్ టెస్ట్ చేసేముందు స్క్రీన్ పై డస్ట్ లేకుండా చూసుకోవాలి తర్వాత   DoIHaveADeadPixel  సైట్ కి వెళ్ళి అక్కడ ఇవ్వబడిన బ్యాక్ గ్రౌండ్ కలర్ ని ఎంచుకొని కీబోర్డ్ పై ’F11' బటన్ ప్రెస్ చెయ్యాలి. ఒకవేళ డెడ్ పిక్సెల్ ఉంటే కనుక పైన చిత్రంలో చూపిన విధంగా మోనిటర్ పై ’.’ కనబడుతుంది.


వెబ్ సైట్: DoIHaveADeadPixel



ధన్యవాదాలు

Wednesday, December 28, 2011

YouTube వీడియోలను Download కాదు ఇలా Save చేసుకోండి









మామూలుగా మనం YouTube వంటి సైట్స్ లో వీడియోలను చూస్తుంటాం. వాటిలో నచ్చినవాటిని Download చెయ్యడానికి Download managers వంటి software’s లేదా కొన్ని రకాల సైట్స్ ను వాడుతుంటాం. కానీ ఇలా చెయ్యడం వల్ల మనకు Bandwidth & Time వేస్ట్ అవుతుంది. మీరు చూసిన వీడియో already మీ కంప్యూటర్ లో లోడ్ అయ్యే వుంటుంది కదా ? దాన్ని మరలా download చెయ్యడం ఎందుకు? అని ఎప్పుడైనా ఆలోచించారా?ఆ లోడ్ అయిన ఫైల్ ను వెదికి సేవ్ చేసుకుంటే సరిపోతుంది కదా?


Limited connections ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరం.


కంప్యూటర్ లో లోడ్ అయిన ఆ ఫైల్ ను నేరుగా కాపీ చెయ్యలేము కాబట్టి Unlocker (782KB) అనే Tool ని Install చేసుకోండి.




మెదట మీరు మీకు కావలసిన వీడియోని పూర్తిగా లోడ్ అవ్వనియ్యండి. విండో Close చెయ్యద్దు...



తర్వాత ఆ వీడియో కోసం ఈ path కు వెళ్ళండి...
Windows XP: C:/Documents and Settings /USERNAME / Local Settings / Temp /
Windows Vista / Windows 7: C:/Users / USERNAME / AppData / Local / Temp/
[ USERNAME అంటే మీ కంప్యూటర్ పేరు ]

ఆ ఫోల్డర్ ఓపెన్ చేసాక అక్కడ fla (ఒక నెంబరు) .tmp అనే పేరుతో ఒక ఫైల్ ఉంటుంది. దానిపై రైట్ క్లిక్ చేసి Unlocker అని క్లిక్ చెయ్యండి.















Fig-1



అప్పుడు వచ్చిన screen లో కింద కాపీ అని ఎంచుకోవాలి (see fig 2.)ఇక ఆ పైల్ ను మీకు నచ్చిన చోట ఒక పేరుతో సేవ్ చేసుకోవచ్చు... అయితే చివర .flv అని extension ఇవ్వడం మరచిపోకండి..



















Fig -2





అదే మీరు చూసిన వీడియో...హ్యాపీగా సేవ్ అయిపోయింది కదా ?



Note: ఈ ప్రాసస్ చేస్తున్నప్పుడు ఆ వీడియో ఉన్న page ను refresh గానీ reload గానీ చెయ్యద్దు.









Free గా ఫోన్ కాల్స్ చేసుకోవాలంటే...

నా మెబైల్ లో బ్యాలన్స్ లేదు... ఒక ఫ్రెండ్ కి కాల్ చెయ్యడం ఎంతో అవసరం ఎలారా అని అలోచిస్తూ గూగుల్ లో వెదుకుతూ ఉంటే http://www.evaphone.com/అనే సైట్ చిక్కింది. దీనిలో రోజుకు రెండు నిమిషాలు కాల్స్ ప్రపంచంలో ఎక్కడికైనా చేసుకోవచ్చు.. అయితే ఒక కాల్ ఒక్క నిమిషం మాత్రమే.సరే రెండు కాల్స్ సరిపోలేదు. మరలా ఇంకా రెండు కాల్స్ కావాలంటే ఇలా చెయ్యండి.మీరు BSNL వంటి Dial-up మోడెమ్ వాడే వారైతే ముందు మీ బ్రౌజర్ history మెత్తం క్లియర్ చెయ్యండి. తర్వాత మోడెమ్ రీస్టార్ట్ లేదా Re-Dial చెయ్యండి. ఇక మీ IP address మారి పోతుంది కదా.... మరలా రెండు కాల్స్ వస్తాయి...

EENADU EDUCATION PAPER (26TH DEC 2011)









ENTRANCE EXAMS



APPSC HYDERABAD DEC 28TH 2011













APPSC HYDERABAD


EENADU EPAPER (29TH DEC 2011)



సాధన చేస్తే... సాయుధ పోలీస్‌




కేంద్ర సాయుధ పోలీసు బలగాల నియామకానికి భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. వివిధ విభాగాల్లో 49 వేల కానిస్టేబుల్‌ పోస్టుల నియామకానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌.ఎస్‌.సి.) రంగం సిద్ధం చేసింది.



ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌, రైఫిల్‌మ్యాన్‌, తదితర ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ విభాగాల్లో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అన్ని పోస్టులను జనరల్‌ డ్యూటీ కేటగిరీలో భర్తీచేయనున్నారు.



అభ్యర్థులు సరైన ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే పదోతరగతితోనే కేంద్రప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు.



కేంద్ర సాయుధ బలగాల్లో పోస్టుల సంఖ్య నుంచి, నియామక ప్రక్రియ మొత్తాన్ని ఎస్‌ఎస్‌సీ పకడ్బందీగా రూపొందించింది. ఖాళీల నోటిఫికేషన్‌తోపాటు శారీరక సామర్థ్య పరీక్షల తేదీల దగ్గర్నుంచి, రాతపరీక్ష ప్రణాళిక, వైద్యపరీక్ష తేదీలు, తుది ఫలితాల వెల్లడి వరకు స్పష్టమైన నియామక ప్రక్రియను వెల్లడించడం అభ్యర్థులకు కలిసొచ్చే విషయం. ఈ విధానం ద్వారా అభ్యర్థులకు సమయం వృధా కాకుండా ఉంటుంది.



మొత్తం పోస్టుల్లో ఐదువేల పైచిలుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిలో 80 శాతం పోస్టులను రాష్ట్ర అభ్యర్థులకు కేటాయిస్తారు.



శారీరక సామర్థ్య పరీక్ష పురుష అభ్యర్థులకు...

* లాంగ్‌జంప్‌: 11 ఫీట్లు (మూడు అవకాశాలు ఇస్తారు)

* హైజంప్‌: 3 1/2 ఫీట్లు (మూడు అవకాశాలు ఉంటాయి)



మహిళా అభ్యర్థులకు...

* లాంగ్‌ జంప్‌: 9 ఫీట్లు (మూడు అవకాశాలు ఉపయోగించుకోవచ్చు)

* హైజంప్‌: 3 ఫీట్లు (మూడు అవకాశాలు ఇస్తారు)


రాతపరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 100. విభాగాల వారీగా ప్రశ్నలు...

* పార్ట్‌-ఎ (జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌): ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. 25 మార్కులు కేటాయించారు.

* పార్ట్‌- బి (జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌): ఇందులో కూడా 25 మార్కులకు 25 ప్రశ్నలుంటాయి.

* పార్ట్‌-సి (ఎలిమెంటరీ మేథమేటిక్స్‌): ఇందులో ప్రశ్నల సంఖ్య 25, కేటాయించిన మార్కులు 25.

* పార్ట్‌-డి (హిందీ లేదా ఇంగ్లిష్‌): అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్‌ భాషను ఎంచుకోవచ్చు. గ్రామర్‌ అంశాలతోపాటు అభ్యర్థి భాషా సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 25 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయించారు.



రాతపరీక్షను అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్‌ భాషలో రాయవచ్చు. ఈ పరీక్షలో అడిగే ప్రశ్నలు పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి కాబట్టి అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు తెలుగు మీడియంలో ప్రిపరేషన్‌ కొనసాగించవచ్చు. ఇంగ్లిష్‌లో ప్రశ్నను అర్థం చేసుకొని సమాధానం గుర్తించగలిగితే సరిపోతుంది. పరీక్ష ఇంగ్లిష్‌ మీడియం కదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.



రాత పరీక్షకు ఎలా?

*జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌: ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో పదాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడం, దాన్ని విశ్లేషించడం, దిశలు, రక్తసంబంధాలు, వెన్‌చిత్రాలు, బొమ్మల పోలిక, నంబర్‌ సీరీస్‌, ర్యాంకింగ్‌; లాజికల్‌ రీజనింగ్‌లో... డాటా సఫిషియన్సీ, డెసిషన్‌ మేకింగ్‌, జడ్జిమెంట్‌, స్టేట్‌మెంట్‌-కంక్లూజన్స్‌, తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.



*జనరల్‌ నాలెడ్జ్‌ - జనరల్‌ అవేర్‌నెస్‌:
ఇందులో కరెంట్‌ అఫైర్స్‌తోపాటు జనరల్‌ నాలెడ్జ్‌ మిలితమై ఉండే జనరల్‌ స్టడీస్‌లోని హిస్టరీ, జాగ్రఫీ నుంచి కొన్ని ప్రశ్నలు, పాలిటీ నుంచి భారత రాజ్యాంగం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని మార్పులు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు జనరల్‌ నాలెడ్జ్‌ పరంగా అంతర్జాతీయ సంస్థలు, అవార్డులు, క్రీడలు, ప్రముఖ గ్రంథ రచయితలు, దేశాలు-రాజధానులు, భారతదేశంలో ప్రథములు, ఇండియన్‌ రైల్వేలు, విమానయానం, ప్రాచీన కట్టడాలు, ప్రముఖుల సమాధులు, ముఖ్యమైన తేదీలు, వివిధ మతాలు, దేశాల సరిహద్దులు, తదితర అంశాలను చదవాలి.



* చరిత్ర: భారత జాతీయోద్యమ చరిత్ర, వివిధ రాజవంశాలు, ఆయా రాజుల కాలంనాటి రాజకీయ పరిస్థితులు, కళలు, లిపులు, సాంస్కృతిక అంశాలు, జైన బౌద్ధమతాలు, సింధూ, ఆర్య నాగరికతలు అధ్యయనం చేయాలి.



* పాలిటీ: దీనిలో భారత రాజ్యాంగ చరిత్ర, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పాలనావ్యవస్థ, రాజ్యసభ, లోక్‌సభ, హైకోర్ట్‌, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రిమండలి, గవర్నర్‌ మొదలైన అంశాలు చదువుకోవాలి.



* జాగ్రఫీ: ఇందులో అక్షాంశాలు, రేఖాంశాలు, శీతోష్ణస్థితి, నీటిపారుదల వ్యవస్థ, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, అడవులు, వ్యవసాయం, తదితర అంశాలు ముఖ్యమైనవి.



* శాస్త్ర, సాంకేతిక రంగం: ఈ విభాగంలో అంతరిక్షం, రక్షణరంగం, అణుశక్తి, తదితర అంశాల నుంచి వర్తమాన విషయాలను అధ్యయనం చేయాలి. ఈ అంశాలతోపాటు పరీక్ష తేదీకి 4 నుంచి 5 నెలల ముందు జరిగిన వర్తమాన విషయాలు చూసుకోవాలి.



ప్రాథమిక గణితం

ఈ విభాగం నుంచి 25 మార్కులకు 25 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో సంఖ్యలు - వాటి ధర్మాలు, భాగాహారాలు, భిన్నాలు, కసాగు- గసాభా, శాతాలు, లాభనస్టాలు, కాలం - దూరం, రైళ్ళు, బారు వడ్డీ, చక్రవడ్డీ, క్యాలండర్‌, కాలం - పని, మొదలైన ప్రాథమిక స్థాయిలోని గణిత ప్రశ్నలు అడుగుతారు.



* ఇంగ్లిష్‌: ఇందులో కేవలం అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. Articles, Prepositions, Verbs, Helping Verbs, Tenses, Voice, Parts of Speechమొదలైన అంశాలతోపాటు Comprehension Passage లాంటి అంశాలు కూడా ప్రాక్టీస్‌ చేయడం మంచిది. ఈ విభాగం కోసం 8, 9, 10 తరగతులలోని గ్రామర్‌ అంశాలు చదివితే సరిపోతుంది.



అర్హతలు, వయోపరిమితి

జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు వయసు 1-8-2012 నాటికి 18 ఏళ్ల నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు 4 జనవరి 2012 నాటికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.



శారీరక ప్రమాణాలు:

* పురుష అభ్యర్థులు 170 సెం.మీ. ఎత్తు ఉండాలి. మహిళా అభ్యర్థులు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.

* చాతీ (పురుష అభ్యర్థులకు మాత్రమే) గాలి పీల్చకుండా ఉన్నప్పుడు 80 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ.లు విస్తీర్ణం పెరగాలి.



గుర్తుంచుకోవాల్సిన అంశాలు

* జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌, అర్థమెటిక్‌ విభాగాలు అభ్యర్థులకు చాలా ముఖ్యమైనవి. ఉద్యోగ సాధనలో ఈ విభాగాలే కీలకం కాబట్టి వీటి ప్రిపరేషన్‌కు అధికంగా సమయం కేటాయించడం తప్పనిసరి.

* అర్థమెటిక్‌ విభాగం కోసం 1 నుంచి 25 వరకు ఎక్కాలు, వర్గాలు, గుణకారాలు, భాగహారాలు తక్కువ సమయంలో చేసేటట్లు సాధన అవసరం.

* గతంలో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ నిర్వహించిన వివిధ ప్రశ్నపత్రాలు సాధన చేయాలి.

* మౌలిక అంశాలు ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకుంటూ, ముఖ్యమైన గణిత ఫార్ములాలు ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించరాదో తెలుసుకోవాలి.

* ప్రాథమిక తరగతుల నుంచి అంశాలవారీగా (జాగ్రఫీ, చరిత్ర, పాలిటీ) పాఠ్యాంశాలను విభజించి సొంత నోట్సు తయారుచేసుకోవాలి.

* జీకే, కరెంట్‌ అఫైర్స్‌తోపాటు జనరల్‌ స్టడీస్‌లోని ప్రతి విభాగంలో ఆబ్జెక్టివ్‌ బిట్లను సాధన చేయడం మంచిది.

* రాతపరీక్ష పదో తరగతి స్థాయిలోనే ఉంటుంది కాబట్టి బేసిక్స్‌పై అధికంగా ప్రశ్నలు ఉంటాయి. పాఠశాల స్థాయి పుస్తకాలలోని అంశాలను బాగా చదవాలి.



శారీరక పరీక్షలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షల్లో లాంగ్‌ జంప్‌, హైజంప్‌ రెండూ క్లిష్టమైనవి. శ్రద్ధతో చేస్తే లాంగ్‌ జంప్‌ కోసం 15-20 రోజుల సాధన సరిపోతుంది.



* లాంగ్‌జంప్‌ కోసం: అభ్యర్థులు జంప్‌ చేసేటప్పుడు టేకాఫ్‌ బోర్డ్‌కు 10 నుంచి 20 అడుగుల దూరం తీసుకొని ప్రాక్టీస్‌ చేయాలి. అలా దూరం నుంచి పరుగెత్తుతూ రావడం వల్ల జంప్‌చేసే స్థాయి పెరుగుతుంది. ముందుగా దగ్గరగా స్టెప్స్‌ వేసుకుంటూ రన్నింగ్‌ చేస్తూ, టేకాఫ్‌ బోర్డ్‌ దగ్గరికి వచ్చే ముందు కాలి అంగల దూరం పెరగాలి. అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి ఒక్కో కాలుపై పట్టు ఉంటుంది. కొందరికి కుడి కాలుపై, కొందరికి ఎడమకాలుపై పట్టు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు సాధన చేయాలి.



* హైజంప్‌ కోసం: అభ్యర్థులు ముందు నుంచీ సెలక్షన్స్‌ కోసం నిర్ణయించిన ఎత్తును ప్రాక్టీస్‌ చేయకుండా, తక్కువ ఎత్తులో, అంటే ముందుగా 2 ఫీట్లు, 2 1/2 ఫీట్లు, 3 ఫీట్లు అలా ఎత్తును పెంచుకుంటూ జంప్‌ చేయాలి. హైజంప్‌ పోల్‌పై ఉంచే కర్రను జంప్‌ చేసినప్పుడు తాకగానే కర్ర పడిపోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. హైజంప్‌ చేసేటప్పుడు పోల్స్‌కు కనీసం 3 అడుగుల దూరం నుంచి జంప్‌ చేసేట్టుగా చూసుకోవాలి. హైజంప్‌లో ఉన్న మూడు పద్ధతుల్లో సీజరింగ్‌, బెల్లీరోలింగ్‌, స్ట్రెయిట్‌జంప్‌... వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని సాధన చేయాలి.





దరఖాస్తు విధానం

అభ్యర్థులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ (ప్రింటెడ్‌ దరఖాస్తు ద్వారా) పద్ధతుల్లో దరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అభ్యర్థులు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా చలానా రూపంలో ఫీజు చెల్లించాలి. ఆఫ్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టాఫీస్‌ ద్వారా సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ ఫీ స్టాంప్స్‌ రూపంలో ఫీజు చెల్లించాలి.



* దరఖాస్తు ఫీజు, జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.50. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆఫ్‌లైన్‌ ద్వారా పూర్తిచేసిన ధరఖాస్తులను ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు 'రీజనల్‌ డైరెక్టర్‌ (ఎస్‌ఆర్‌), స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఈవీకే సంపత్‌ బిల్డింగ్‌, సెకండ్‌ ఫ్టోర్‌, కాలేజ్‌ రోడ్‌ చెన్నై, తమిళనాడు- 600006' చిరునామాకు పంపించాలి. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు హైదరాబాద్‌, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలున్నాయి.



* దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 4 జనవరి 2012.

* శారీరక సామర్థ్య పరీక్షలు: ఫిబ్రవరి- మార్చిలో

* రాతపరీక్ష తేదీ: 22-4-2012

* వైద్యపరీక్షలు: జూన్‌-జులై

* తుది ఫలితాల వెల్లడి: 30-9-2012.

ఐఐటీ మద్రాస్‌లో ఎం.ఎ.

ఇంజినీరింగ్‌కు ప్రసిద్ధిచెందిన ఐఐటీ మద్రాస్‌, అదే స్థాయి నాణ్యతతో హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌లో ఇంటెగ్రేటెడ్‌ కోర్సులను నిర్వహిస్తోంది.ఈ కోర్సుల్లో ప్రవేశానికి 'హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌' (హెచ్‌ఎస్‌ఈఈ 2012) పేరుతో జాతీయస్థాయిలో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది.ఇంటర్‌ డిసిప్లీనరీ స్వభావం గల ఈ కోర్సుల ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.కోర్సుల వివరాలు...* ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎ. (ఇంగ్లిష్‌ స్టడీస్‌)* ఇంటెగ్రేటెడ్‌ ఎం.ఎ. (డెవలప్‌మెంట్‌ స్టడీస్‌)అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కోర్సులను ఐఐటీ మద్రాస్‌ రూపొందించింది. రెండు ప్రోగ్రామ్‌లలో ఎకాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, స్టాటిస్టిక్స్‌, మేథమేటిక్స్‌, ఐటీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో బేసిక్‌ కోర్సులు ఉంటాయి. ఫ్రెంచ్‌, జర్మన్‌ భాషలను అధ్యయనం చేస్తారు. మొదటి రెండేళ్లు రెండు ప్రోగ్రామ్‌ల అభ్యర్థులకు ఒకే సబ్జెక్టులు ఉంటాయి. మూడో ఏడాది నుంచి ఎంచుకున్న స్పెషలైజేషన్‌ల వారీగా అభ్యర్థులను విభజిస్తారు.ఇవి రెండూ ఐదేళ్ల కోర్సులు.ఒక్కో కోర్సులో 23 సీట్లు చొప్పున మొత్తం 46 సీట్లు ఉంటాయి. ట్యూషన్‌ ఫీజు సెమిస్టర్‌కు రూ.4500. హాస్టల్‌, ఇతర ఫీజులు సెమిస్టర్‌కు 15-16 వేల రూపాయల వరకు ఉంటాయి.కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు విద్యారంగం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని కంపెనీలు, పరిశోధన సంస్థలు, ఎన్‌జీఓలు, ఇతర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి.పరీక్ష పద్ధతిపరీక్ష వ్యవధి 3 గంటలు. పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్‌-1 ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పరీక్ష. దీని వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ (స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థ, భారతీయ సమాజం, రెండో ప్రపంచ యుద్ధానంతరం సమకాలీన ప్రపంచ వ్యవహారాలు), ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకాలజీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో ఇంగ్లిష్‌, ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీకి ఒక్కోదానికి 25 శాతం మార్కులు, జనరల్‌ స్టడీస్‌కు 50 శాతం మార్కులు కేటాయించారు.* ఇంగ్లిష్‌లో రీడింగ్‌ స్కిల్స్‌, గ్రామర్‌, వొకాబ్యులరీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.* ఎనలిటికల్‌ ఎబిలిటీలో నంబర్స్‌, ఆల్జీబ్రా, హెచ్‌సీఎఫ్‌, ఎల్‌సీఎం, బేసిక్‌ స్టాటిస్టిక్స్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, ఎనలిటికల్‌ రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌, బ్రెయిన్‌టీజర్స్‌, తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.* పార్ట్‌-2లో వ్యాస రచన ఉంటుంది. దీని వ్యవధి అరగంట. ఇందులో కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన అంశాలపై వ్యాసం రాయాలి.దరఖాస్తు విధానంహెచ్‌ఎస్‌ఈఈ రాయడానికి ఇంటర్మీడియట్‌ / 10+2 ప్రధాన అర్హత. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం మార్కులు అవసరం. చివరి సంవత్సరం పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అడ్మిషన్‌ సమయంలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. ఐఐటీ మద్రాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంది. దరఖాస్తు ప్రక్రియ 20 డిసెంబరు 2011 నుంచి ప్రారంభమవుతుంది. పరీక్ష మనరాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే జరుగుతుంది.* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: 20 జనవరి 2012* దరఖాస్తు ప్రింట్లు చేరడానికి చివరితేదీ: 31 జనవరి 2012* హెచ్‌ఎస్‌ఈఈ 2012 తేదీ: 6 మే 2012* ఫలితాల విడుదల: 4 జూన్‌ 2012.

ఆకర్షణీయం... ఐసీఐసీఐ ఎంబీఏ

ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ సంయుక్తంగా ఎంబీఏ (ఫైనాన్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌) కోర్సును నిర్వహిస్తున్నాయి.

ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగం లభిస్తుంది. 'ఐసీఐసీఐ బిజినెస్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌' పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు.

బ్యాంకింగ్‌ రంగంలో ఉన్నత స్థాయి ప్రొఫెషనల్స్‌ను తయారుచేయడం దీని ప్రధాన లక్ష్యం.

కార్పొరేట్‌ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌కు ఐసీఐసీఐ -ఎన్‌ఐఐటీ అందిస్తోన్న ఎంబీఏ మంచి అవకాశాలు కల్పిస్తోంది. ఆయిల్‌, గ్యాస్‌,ప ఎనర్జీ, పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌, ఫార్మా, స్టీల్‌, ఏవియేషన్‌, టెలికాం, ఫైనాన్స్‌, టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌, అకౌంట్స్‌, తదితర రంగాల్లో పనిచేస్తోన్న ప్రొఫెషనల్స్‌ ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు.

ఏడాదికి రూ.15 లక్షల ప్రారంభ వేతనంతో ఐసీఐసీఐ బ్యాంకు ఈ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. హోల్‌సేల్‌ బ్యాంకింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, గ్లోబల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, తదితర విభాగాల్లో వీరికి అవకాశాలుంటాయి.

కోర్సు స్వరూపం
కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 8 టర్మ్‌లు ఉంటాయి. వీటిలో 1, 2 టర్మ్‌లు క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌, తర్వాతి రెండు (3, 4) టర్మ్‌లు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. 5,6 టర్మ్‌లు క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌, 7,8 టర్మ్‌లలో సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఒక్కో టర్మ్‌ వ్యవధి మూడు నెలలు. అభ్యర్థి ఎంచుకున్న ఎలక్టివ్‌లను బట్టి కార్పొరేట్‌ బ్యాంకింగ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీలో శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక మేనేజర్‌ గ్రేడ్‌-2, అనుభవాన్ని బట్టి అంతకంటే ఉన్నత స్థాయిలో ఉద్యోగం పొందవచ్చు.

* కోర్సు ఫీజు రూ.4.5 లక్షలు. ఈ మొత్తాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఏడాదికి 2.5 శాతం వడ్డీతో రుణంగా ఇస్తుంది. కోర్సుకాలంలో ఏమీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు పూర్తయ్యాక, ఉద్యోగంలో చేరిన దగ్గర్నుంచి 60 ఈఎంఐల రూపంలో రుణం తిరిగి చెల్లించాలి.

* కోర్సు కాలంలో నెలకు రూ.10000 స్టయిపెండ్‌ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకులో ఇంటర్న్‌షిప్‌ కాలంలో నెలకు రూ.50000 స్టయిపెండ్‌ ఇస్తారు. అభ్యర్థులు కనీసం మూడేళ్లు ఐసీఐసీఐ బ్యాంకులో తప్పనిసరిగా పనిచేయాలి. ఈమేరకు రూ.20 లక్షలకు బాండ్‌ సమర్పించాలి.

ఎంపిక, అర్హతలు
మొత్తం సీట్లు 120. ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎంట్రన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, సైకోమెట్రిక్‌ ప్రొఫైలింగ్‌ లేదా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటాయి. ఎంట్రన్స్‌ టెస్ట్‌లో వెర్బల్‌ ఎబిలిటీ, న్యుమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. గ్రూప్‌ డిస్కషన్‌లో ప్రధానంగా అభ్యర్థికి గల విశ్లేషణాత్మక, సమస్యా పరిష్కార సామర్థ్యాలను పరీక్షిస్తారు. కోర్సు ఏప్రిల్‌ 2012 నుంచి ప్రారంభమవుతుంది. శిక్షణ రాజస్థాన్‌లోని ఎన్‌ఐఐటీ యూనివర్సిటీలో ఉంటుంది.

సీఏ, ఇంజినీరింగ్‌, ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ప్రొఫెషనల్స్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ, ఫైనాన్స్‌, ఎకనమిక్స్‌, లా, కామర్స్‌, స్టాటిస్టిక్స్‌ గ్రాడ్యుయేట్లు కూడా అర్హులు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఫార్మా, స్టీల్‌, ఇన్‌ఫ్రా, సాఫ్ట్‌వేర్‌, ఏవియేషన్‌, పవర్‌, టెలికాం, ఫైనాన్స్‌, పెట్రోలియం, మాన్యుఫ్యాక్చరింగ్‌, తదితర రంగాల్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ వరకు అన్ని కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులుండాలి.

వయసు 15 ఏప్రిల్‌ 2012 నాటికి 30 ఏళ్లకు మించరాదు.

* అభ్యర్థులు ఐసీఐసీఐ కెరీర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు మనరాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 1 జనవరి 2012.
http://www.icicicareers.com/icici-niit/fee-stipend.html

Wednesday, December 21, 2011

ఇంజినీర్లూ... స్వాగతం!

'సాఫ్ట్‌వేర్‌, ఇతర ప్రైవేటు ఉద్యోగాల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే మేలు' అనుకునే ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు రాష్ట్ర విద్యుత్‌సంస్థ తాజా ఉద్యోగ ప్రకటన వరంలాంటిది.



ఏపీ జెన్‌కోలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయటానికి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఏపీ ట్రాన్స్‌కో నుంచి నోటిఫికేషన్‌ రాబోతోంది.



రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బి.ఇ./బి.టెక్‌/ ఎ.ఎం.ఐ.ఇ.లలో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచిల వారికి ఇదో చక్కని అవకాశం.



రాష్ట్రంలో అతి పెద్ద విద్యుదుత్పాదనతో భారతదేశంలో రెండో అతి పెద్ద హైడల్‌ సామర్థ్యాన్ని కలిగిన సంస్థ ఏపీ జెన్‌కో. ఈ సంస్థ  ట్రెయినీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగ నియామకాలకు ప్రకటన జారీ చేసింది. ఇందులో 61 ఖాళీలు పరిమిత నియామకానికి (limited recruitment) సంబంధించినవి. 350 ఖాళీలు సాధారణ నియామకానికి (general recruitment ) సంబంధించినవి.



వెరసి మొత్తం 411 పోస్టులను భర్తీ చేయబోతున్నారు.



2011 డిసెంబరు 1 నాటికి అభ్యర్థుల వయసు 34 సంవత్సరాలు మించివుండకూడదు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయః పరిమితిలో ఐదేళ్ళ సడలింపు ఇస్తారు. అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు పదేళ్ళ సడలింపు ఉంటుంది.



జీతం స్కేలు: రూ.23115-955-25025-1115-30600-1280-35720



ఆన్‌లైన్‌ దరఖాస్తులు

ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలలో ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా తమ దరఖాస్తులను పూరించి పంపించాలి. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం- ఇంటర్‌నెట్‌పై దరఖాస్తులను పంపే విధానంపై అవగాహన లేనివారు స్నేహితుల, లేదా ఈ ప్రక్రియపై అవగాహన ఉన్నవారి సహాయం తీసుకోవాలి.



ఎందుకంటే ఉద్యోగ దరఖాస్తుకు ఇది తొలిమెట్టు, అత్యంత కీలకఘట్టం. దరఖాస్తులో నింపే సమాచారంలో ఎలాంటి పొరపాట్లు దొర్లినా, మీ సర్టిఫికెట్ల సమాచారంతో ఆన్‌లైన్‌ సమాచారం సరిపోకపోయినా దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. తద్వారా ఉద్యోగావకాశం చేజారుతుంది. అందుకని ఇందులో ఎలాంటి నిర్లక్ష్యమూ పనికిరాదు.



దరఖాస్తు చేసేదెలా?

ఏపీ జెన్‌కోలో ట్రెయినీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేయగోరే అభ్యర్థులుhttp:// www.apgenco.gov.in వెబ్‌సైట్‌ లోకి లాగిన్‌ అయ్యి Apply Online పై క్లిక్‌ చేయాలి. లేదా నేరుగా http://apgenco.cgg.gov.in లోకి లాగిన్‌ అవడం ద్వారా నోటిఫికేషన్‌, దరఖాస్తు వివరాలను పొందవచ్చు. డిసెంబరు 20 నుంచి జనవరి 3 వరకూ ఆన్‌లైన్‌ దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.



దరఖాస్తుదారుల్లో ఓసీ అభ్యర్థులు/ ఇతర రాష్ట్రాల అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సివుంటుంది. (దీనిలో రూ.350 పరీక్ష ఫీజు+ రూ.150 దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ఫీజు). బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, అంగవికలురు రూ.150 చెల్లించాలి. ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. జనవరి 3, 2012 మధ్యాహ్నం ఒంటిగంటలోపు ఈ ఫీజు చెల్లించాల్సివుంటుంది. భర్తీ చేసిన దరఖాస్తులు జనవరి 3, 2012 రాత్రి 11.59 గంటలలోపు పంపించవచ్చు.



ట్రెయినీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసే ఇంజినీరింగ్‌ అభ్యర్థులు సంబంధిత బ్రాంచిలలో డిసెంబరు 1, 2011 నాటికి విద్యార్హతను సాధించివుండాలి.



ఎంపిక విధానం

ఏపీ జెన్‌కో ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్షను జనవరి 22న నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో రెండు విభాగాలుంటాయి.



సెక్షన్‌ 'ఎ'లో 70 మార్కులకు కోర్‌ సబ్జెక్టుపై, సెక్షన్‌ 'బి'లో 30 మార్కులకు ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు. వివిధ ఇంజినీరింగ్‌ బ్రాంచిలకు నిర్దేశించిన సిలబస్‌ను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.





రాత పరీక్షలను హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో మాత్రమే నిర్వహిస్తారు. సాధారణంగా పరీక్ష హాల్లోకి కాల్‌క్యులేటర్లను అనుమతించరు. గతంలో జరిగిన GATE, ఇంజినీరింగ్‌ పరీక్షా పత్రాల నుంచి చాలావరకూ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరముంది. ఇంజినీరింగ్‌లోని ప్రాథమిక అంశాల (Basics ) నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడగవచ్చు. అందుకే వీటిపై అభ్యర్థులు దృష్టి సారించాలి.



రెండు గంటల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సివున్నందున సమయ నిర్వహణ ఎంతో ముఖ్యం. గత పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులు లేవు. ఈసారి పరీక్షలో నెగిటివ్‌ మార్కులకు సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించలేదు. అందుకే పరీక్షకేంద్రంలో ప్రశ్నపత్రంపై ఉండే సూచనలను జాగ్రత్తగా చదివి పాటించాలి.



రెండు విభాగాల్లోనూ సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. కనీస అర్హత మార్కులు: ఓసీ: 40 శాతం, బీసీ : 35 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీ, పీసీ: 30 శాతం. నియామకం పొందాక, శిక్షణ సమయంలో అభ్యర్థులు అర్హతకు సంబంధించిన అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లనూ కంపెనీకి సమర్పించాల్సివుంటుంది.



- వై.వి. గోపాలకృష్ణమూర్తి

గ్రూప్ -1 ఇంటర్వ్యూలో విజయీభవ!



గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక మిగిలింది మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) దశ.



ప్రశ్నలు అడగటం, అభ్యర్థి చెప్పే సమాధానాల్లో కచ్చితత్వం చూడటానికి మాత్రమే ఈ ప్రక్రియ పరిమితం కాదు. అభ్యర్థి మూర్తిమత్వ లక్షణాల పరిశీలన, తద్వారా ఉద్యోగానికి అభ్యర్థి ఎంతవరకూ సరిపోతాడో ఒక నిర్థారణకూ, నిర్ణయానికీ రావటానికి ఇది ఉపయోగపడుతుంది.రాతపరీక్షల ద్వారా బయటపడని మానసిక, శారీరక లక్షణాలను గమనించటం ఇంటర్వ్యూలోనే సాధ్యమవుతుంది.



ఏ మౌఖిక పరీక్షలోనైనా సాధారణంగా ఐదు దశలుంటాయి. ప్రవేశించే దశ (Entry), పరిచయం, లోతైన చర్చ, ముగింపు, నిష్క్రమణ (Exit).



1. ప్రవేశించే దశ

అభ్యర్థి బోర్డు గదిలోకి ఎంత cosy గా ప్రవేశించాడు; పరిసరాలనూ, బోర్డు సభ్యులనూ ఎలా చూశాడు, సభ్యులను ఎలా సంబోధిస్తున్నాడు లాంటివి పరిశీలించి 'తొలి అభిప్రాయాన్ని' ఏర్పరచుకునే అవకాశం ఈ దశలో బోర్డుకు ఉంటుంది. అభ్యర్థి సాధన చేయగలిగితే ఈ దశలో మంచి అభిప్రాయం కలగజేసే వీలుంటుంది.



2. పరిచయం

'మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి' అని అభ్యర్థిని బోర్డు అడగవచ్చు. లేదా బోర్డు చైర్మన్‌ అభ్యర్థి బయోడేటాను క్లుప్తంగా మిగతా సభ్యులకు వినపడేలా చదదవచ్చు. ఆహ్లాద వాతావరణం ఏర్పడేందుకు సులభమైన, అభ్యర్థికి సంబంధించిన ప్రశ్నలనే అడుగుతారు. అభ్యర్థి కుటుంబం, విద్యా ప్రగతి, చేస్తున్న ఉద్యోగం లాంటివి ఈ పరిచయ ప్రశ్నల్లో భాగంగా చేరవచ్చు. దినపత్రికల్లో వస్తున్న వార్తలను ప్రస్తావించవచ్చు.



ఒక బోర్డులో... 'ఈ ఆఫీసుకు మీరెలా వచ్చారు?', 'బస్సులో మీ పక్క ప్రయాణికులను పరిచయం చేసుకున్నారా?' 'హైదరాబాద్‌ బస్సు ప్రయాణం ఎలా ఉంది?' లాంటి పరిచయ ప్రశ్నలు అడిగి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యపై చర్చ కొనసాగించారు.







3. లోతైన చర్చ

ఏదో ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థి శక్తి సామర్థ్యాలు పరిశీలించేందుకు 'సన్నివేశ' కల్పన జరుగుతుంది. విషయ వివరణ, విభిన్నకోణాల పరిశీలన, వాద ప్రతివాదనలు, ధనాత్మక - సకారాత్మక ధోరణులు మొదలైన అంశాలను బోర్డు పరిగణనలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా భావోద్వేగాల నియంత్రణలో అభ్యర్థి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుంటారు. బోర్డు రకరకాల ఒత్తిడులను ఈ దశలో ప్రయోగించవచ్చు.



లోతైన చర్చ నుంచి బయటపడే లక్షణాలు:. ఒత్తిడికి ప్రతిస్పందన, సహనస్థాయి, స్థిత ప్రజ్ఞత, బలాలు- బలహీనతలు, వినయం, సేవాతత్పరత, నిజాయతీ, దార్శనికత (vision).



4. ముగింపు

చర్చించిన విషయాన్ని అభ్యర్థి ఏ విధంగా ముగిస్తున్నాడు, అతడి అంతిమ భావన ఏమిటి, మొదట తాను కలిగివున్న భావనల నుంచి బయటపడ్డాడా? అసంబద్ధమైన భావనలనే చర్చ ముగింపులో కూడా కలిగివున్నాడా లాంటివి పరిశీలిస్తారు. అభ్యర్థి తన హేతుబద్ధ భావనలను బోర్డు ఒత్తిడి కారణంగా వదులుకున్నాడా, 'తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు' ధోరణితో వ్యవహరించాడా ... ఇవన్నీ గమనిస్తారు.



5. నిష్క్రమణ

బోర్డు చైర్మన్‌ 'ఇక మీరు వెళ్ళవచ్చు' అని చెప్పినపుడు నిదానంగా బోర్డు సభ్యులందర్నీ ఒకసారి చూసి చైర్మన్‌కి 'కృతజ్ఞతలు' తెలియజేసి బయటకు వెళ్ళాలి. ఇలా వెళ్ళేటప్పుడు...

* బోర్డు నుంచి పారిపోయినట్టుగా వేగంగా వెళ్తున్నాడా?

* ఇంటర్వ్యూ జరిగినదాన్ని బట్టి అసంతృప్తి/సంతృప్తికి గురై అదే బాధ/ఆనందంతో వెళ్తున్నాడా?

* ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించే అవకాశం మరింత ఉంటే బాగుణ్ణు అనే అభిప్రాయం అభ్యర్థిలో ఉందా?

ఇలాంటివి అంచనా వేసే అవకాశముంది. అందుకే exit behaviour ని సాధన చేయాల్సివుంటుంది.



సిద్ధం కావాల్సినవి...

1) బయోడేటా సమాచారం 2) గ్రూప్‌-1 మెయిన్స్‌ సిలబస్‌లోని పేపర్‌-2, 3, 4 అంశాలు 3) జాతీయ, అంతర్జాతీయ విషయాలు 4) రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 5) సామాజిక అంశాలు 6) తాజా ఆర్థిక పరిణామాలు 7) పార్లమెంటులో ప్రవేశపెట్టిన తాజా బిల్లులు 8) గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టుల ప్రాథమికాంశాలు




 

DoIHaveADeadPixel - మోనిటర్ లో డెడ్ పిక్సెల్స్ తెలుసుకోవటానికి!

అనేక ప్రముఖ ఉచిత అప్లికేషన్లను అందిస్తున్న కొమోడో  Comodo Unite అనే అప్లికేషన్ ని ఉచితంగా అందిస్తుంది. Comodo Unite ని ఉపయోగించి వివిధ కంప్యూటర్ల మధ్య  సులభంగా సురక్షితమైన స్వంత VPN (Virtual Private Network) ని క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో వివిధ కంప్యూటర్ల మధ్య ఫైళ్ళ సులభంగా షేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా లోకల్ ఏరియా నెట్ వర్క లో లా ఒక పీసీ నుండి మరొక పీసీ ని సులభంగా యాక్సెస్ చెయ్యవచ్చు మరియు గ్రూప్ ఛాటింగ్ సదుపాయం కూడా కలదు.




Comodo Unite ని నెట్ వర్క్ లో యాక్సెస్ చెయ్యవలసిన అన్ని కంప్యూటర్లలో ఇనస్టలేషన్ చేసుకోవాలి.


మరింత సమాచారం కొరకు Comodo Unite సైట్ చూడండి.


డౌన్లోడ్: Comodo Unite


ధన్యవాదాలు

EENADU EPAPER 22ND DEC 2011










Saturday, December 17, 2011

Comodo Unite: రిమోట్ కంప్యూటర్ యాక్సెస్, స్వంత VPN క్రియేట్ చేసుకోవటానికి!

అనేక ప్రముఖ ఉచిత అప్లికేషన్లను అందిస్తున్న కొమోడో  Comodo Unite అనే అప్లికేషన్ ని ఉచితంగా అందిస్తుంది. Comodo Unite ని ఉపయోగించి వివిధ కంప్యూటర్ల మధ్య  సులభంగా సురక్షితమైన స్వంత VPN (Virtual Private Network) ని క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో వివిధ కంప్యూటర్ల మధ్య ఫైళ్ళ సులభంగా షేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా లోకల్ ఏరియా నెట్ వర్క లో లా ఒక పీసీ నుండి మరొక పీసీ ని సులభంగా యాక్సెస్ చెయ్యవచ్చు మరియు గ్రూప్ ఛాటింగ్ సదుపాయం కూడా కలదు.




Comodo Unite ని నెట్ వర్క్ లో యాక్సెస్ చెయ్యవలసిన అన్ని కంప్యూటర్లలో ఇనస్టలేషన్ చేసుకోవాలి.


మరింత సమాచారం కొరకు Comodo Unite సైట్ చూడండి.


డౌన్లోడ్: Comodo Unite


ధన్యవాదాలు

గ్రూప్‌-1 కొలువుకు తొలిమెట్టు

గ్రూప్‌-1 పరీక్ష ప్రిపరేషన్‌లో కీలకఘట్టం ఆన్‌లైన్‌ దరఖాస్తును సక్రమంగా పూర్తిచేసి పంపడంతోనే ప్రారంభమవుతుంది.



'దరఖాస్తు పంపించటమేముందిలే?' అనే తేలికభావం తగదు. సరిగా పూరించని చాలామంది అభ్యర్థుల దరఖాస్తులు గతంలో తిరస్కరణకు గురై హాల్‌టికెట్లు జారీ కాలేదు. ఇలాంటి చిక్కుల్లేకుండా లక్ష్యం దిశగా దూసుకువెళ్ళాలంటే ఆన్‌లైన్‌ దరఖాస్తు నింపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎ.ఎం. రెడ్డి! 



లక్షల మంది ఉద్యోగార్థుల చిరకాల నిరీక్షణ ఫలించి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగాల నియామకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయింది. దీని ద్వారా 19 రాష్ట్రప్రభుత్వ శాఖలకు సంబంధించి 304 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వీటిని సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నవారు వెంటనే ఆన్‌లైన్‌ దరఖాస్తును పంపుకోవాలి.



తెలుగు మీడియం అభ్యర్థులు, కంప్యూటర్‌ అవగాహన లేనివారు, ఇంటర్నెట్‌ అందుబాటులో లేనివారు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు పొందడమెలా?

అభ్యర్థులు మొట్టమొదట ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ కోసం www.apspsc.gov.inను క్లిక్‌ చేయాలి. హోమ్‌పేజీ కనపడుతుంది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై క్లిక్‌ చేసి తన పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కమ్యూనిటీ (కులం) ఎంటర్‌ చేస్తే చెల్లించవలసిన ఫీజుకు సంబంధించిన చలాన్‌ వస్తుంది. దాన్ని ప్రింట్‌ తీసుకోవాలి. ఏపీ ఆన్‌లైన్‌లో కానీ, ఏదేని ఎస్‌.బి.ఐ. బ్రాంచిలో కానీ నిర్దేశించిన ఫీజు చెల్లించాలి.



ఇక్కడ ముఖ్యంగా గ్రూప్‌-1 రాయబోయే ప్రతి అభ్యర్థీ ఏ విధమైన రిజర్వేషన్‌తో ప్రమేయం లేకుండా రూ. 100 దరఖాస్తు ప్రాసెసింగ్‌ కోసం తప్పక చెల్లించాలని మరిచిపోకూడదు.



ఫీజు మినహాయింపులో చిక్కు

ఏ విధమైన ఫీజు మినహాయింపు లేనివారికి అంటే... ఉద్యోగం చేసే ఒ.సి. అభ్యర్థులందరూ అదనంగా మరో రూ. 120 చెల్లించవలసి ఉంటుంది. ఒ.సి. అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, ప్రైవేటు లేదా సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తున్నా రూ. 120 తప్పక చెల్లించాలి.



నిజానికి 34 సంవత్సరాల లోపు నిరుద్యోగ ఒ.సి.లు ఈ రూ. 120 చెల్లించవలసిన పనిలేదు. కాబట్టి చాలామంది ప్రైవేటు విద్యా సంస్థలలో లేదా ఇతర ప్రైవేటు సంస్థలలో పని చేసేవారు ఈ ఫీజు మినహాయింపు పొందాలని చూస్తారు



కానీ, ఇంటర్వ్యూ సమయంలో ఆ అభ్యర్థులను 'డిగ్రీ/పీజీ అయిన తరవాత ఏం చేస్తున్నారు' అనడిగితే వెంటనే 'ప్రైవేటు రంగంలో ఫలానా ఉద్యోగం చేస్తున్నా'నని సమాధానం ఇస్తూ ఉంటారు. అప్పుడు వారు నిజాయతీగా ఫీజు మినహాయింపు పొందలేదని బోర్డుకు తెలిసిపోతుంది. ఇంటర్వ్యూలో అలాంటి అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే రూ. 120 ఫీజు చెల్లిస్తే తమ నిజాయతీని నిరూపించుకొన్నట్లు అవుతుంది. ఇది వారికి 'ప్లస్‌ పాయింటే'!



అభ్యర్థులందరూ ఫీజు చెల్లించిన తరవాత వారికి ఫీజు చెల్లించిన చలాన్‌కు ఓ జర్నల్‌ నం. బ్యాంకు ద్వారా గానీ, ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా గానీ లభిస్తుంది. ఆ నంబరు ద్వారా ఫీజు చెల్లించిన మర్నాడు మధ్యాహ్నం రెండు గంటల తరవాత తిరిగి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి సంబంధిత కాలమ్‌లో ఆ జర్నల్‌ నంబర్‌ను ఎంట్రీ చేసి దరఖాస్తును పొందవచ్చు.



ఇంటర్నెట్‌ కేంద్రాలు

చాలామంది గ్రామీణ అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు పంపటంలో స్థానికంగా ఉండే ఇంటర్నెట్‌ కేంద్రాలపై ఆధారపడతారు. ఆ కేంద్రాల ఆపరేటర్లు తమ ఇష్టం వచ్చినట్టు తెలిసో తెలియకో ఆప్షన్లను క్లిక్‌ చేసే అవకాశముంది. దీనివల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సివుంటుంది. ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తు ప్రింట్‌ కాపీని తప్పనిసరిగా తీసుకుని అందులోని సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.



చివరి తేదీ

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాల్సిన చివరితేదీ జనవరి 8 కదా అని ఆ రోజు వరకూ తాత్సారం చేస్తే గ్రూప్‌-1 అవకాశం చేజారిపోతుంది. దరఖాస్తు పంపే చివరితేదీ జనవరి 8 కానీ ఫీజు చెల్లించాల్సిన చివరితేదీ జనవరి 6 అని మర్చిపోకూడదు.



చివరితేదీ వరకూ వేచివుండకుండా సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు పంపుకోవడం మంచిది. ఎందుకంటే దరఖాస్తు పంపిననాటి నుంచే అభ్యర్థుల్లో పరీక్ష పట్ల ఆసక్తి పెరుగుతుంది. 'దరఖాస్తు పంపిన తర్వాత అంటే జనవరి 8 నుంచి ప్రారంభిద్దాంలే' అని నిర్లక్ష్యం చేస్తే ఈ పోటీపరీక్షకు సమయం సరిపోదని గుర్తించండి.



దరఖాస్తును ఆన్‌లైన్‌ ద్వారా పంపాక అది ఏ స్థాయి (status)లో ఉందో తెలుసుకోవాలంటే ఏపీపీఎస్‌సీ హోమ్‌ పేజ్‌లో పోటీపరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ నంబర్‌నూ, రెఫరెన్స్‌ ఐడీ నంబర్‌నూ, మీ పుట్టినతేదీనీ ఎంటర్‌ చేసి తెలుసుకోవచ్చు. దీనికోసం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ నంబర్‌ 18/2011- తేదీ 28-11-2011 నూ, అభ్యర్థి రెఫరెన్స్‌ ఐడీనీ భద్రపరుచుకోవాలి.



చివరిగా ఆన్‌లైన్‌ దరఖాస్తులోని చివర్లో ఉన్న imageలోని అక్షరాలను యథాతథంగా టైపు చేయాలి. లేకుంటే దరఖాస్తును స్వీకరించరు.



ఈ విధంగా దరఖాస్తును సరైనరీతిలో గడువుకు ముందుగానే పంపించడంతో గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ తొలి మెట్టు అధిరోహించినట్టే!



వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగాలు

ల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అన్నారు గాంధీజీ. గ్రామ స్వరాజ్యం గురించి మన రాజ్యాంగంలోని నిర్దేశిక నియమాలలో కూడా ప్రస్తావించడం జరిగింది.



అంతటి ప్రాధాన్యం గల గ్రామాల్లో దిగువ స్థాయి ప్రజాసేవకులు చాలా కీలకపాత్ర పోషిస్తారు. అందుకే ప్రభుత్వం చేపట్టిన వీఆర్‌ఓ (విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్స్‌), వీఆర్‌ఏ (విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్స్‌) నియామకాలకు అభ్యర్థుల్లో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం చేపట్టిన ఈ నియామకాలకు బాగా పోటీ నెలకొంది.



ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచనలు అందిస్తున్నారు వి.జె.రెడ్డి.



గ్రామానికి తలలో నాలుకలా ఉండే వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగాల ద్వారా ప్రజలకు చేరువై సేవచేసే అవకాశం లభిస్తుంది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వీఆర్‌ఓ, పదో తరగతి అర్హతతో వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నియామక ప్రకటన విడుదల చేసింది. వీఆర్‌ఓ పోస్టులు 1172, వీఆర్‌ఏ పోస్టులు 6063 ఉన్నాయి. వీఆర్‌ఓ ఉద్యోగాల్లో 760 పోస్టులు జనరల్‌ కేటగిరీకి, 412 పోస్టులు మహిళలకు కేటాయించారు. వీఆర్‌ఏ పోస్టులకు లక్షన్నర మంది, వీఆర్‌ఓ పోస్టులకు సుమారు నాలుగు లక్షల మంది పోటీపడతారని అంచనా.



వీఆర్‌ఓ ఉద్యోగాలు జిల్లా స్థాయికి చెందినవి. అందువల్ల సంబంధిత జిల్లా అభ్యర్థులు మాత్రమే ఆయా జిల్లాలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. నాన్‌లోకల్‌ రిజర్వేషన్లు వర్తించవు. వీఆర్‌ఏ ఉద్యోగాలకు... ఏ గ్రామంలో ఖాళీ ఉంటే ఆ గ్రామవాసులే దరఖాస్తు చేసుకోవాలి.



ఈ రెండు పోస్టులకు రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 3 విభాగాలు ఉంటాయి...

* జనరల్‌ స్టడీస్‌: 60 మార్కులు

* అర్థమెటిక్‌ స్కిల్స్‌: 30 మార్కులు

* లాజికల్‌ స్కిల్స్‌: 10 మార్కులు




జనరల్‌ స్టడీస్‌ విభాగంలోని 60 ప్రశ్నల్లో 30 ప్రశ్నలు గ్రామాలకు సంబంధించిన అంశాలపై ఉంటాయి. వీఆర్‌ఓలుగా నియమితులైన అభ్యర్థులు పదోన్నతుల ద్వారా తహసీల్దారు దశ వరకు ఎదిగే అవకాశం ఉంటుంది. పరీక్షలోని వివిధ విభాగాలను పరిశీలిద్దాం.



జనరల్‌ స్టడీస్‌

ఇందులో కామన్‌ సబ్జెక్టులైన చరిత్ర, భూగోళశాస్త్రం, అర్థశాస్త్రం, భారత రాజ్యాంగం, జనరల్‌ సైన్స్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

* చరిత్ర: భారతదేశ చరిత్రలో ఉన్న ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగ అంశాలను అధ్యయనం చేయాలి. చరిత్రలో నాగరికతలు, ప్రాచీన భారతీయ రాజవంశాలు, వారి పాలన, దండయాత్రలు, రాజుల ఆస్థానంలోని విశేషాలు, ప్రముఖ గ్రంథాలు, బిరుదులు సిలబస్‌లో ఉన్నాయి. మధ్యయుగంలో విశేషాలు, ఆధునిక చరిత్రలో బ్రిటిష్‌వారి రాక, వారి రాజ్యకాంక్ష, ఇతరులతో ప్రముఖ యుద్ధాలు, ప్రముఖ సంఘటనలు, సిపాయిల తిరుగుబాటు, భారత జాతీయ స్వాతంత్య్ర సంగ్రామం మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.



అభ్యర్థులు చరిత్రకు సంబంధించిన అంశాలను ఇంటర్మీడియట్‌ స్థాయిలో చదవాలి. స్కూలు పుస్తకాలను కూడా క్షుణ్నంగా చదవాలి. సొంతగా నోట్సు రాసుకునే సమయం లేదు కాబట్టి చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లను పుస్తకాల్లోనే అండర్‌లైన్‌ చేసుకోవడం మంచిది. దీనివల్ల రివిజన్‌ సులువవుతుంది.



* భూగోళశాస్త్రం: ఈ అంశాలను ప్రాథమిక తరగతుల నుంచే అధ్యయనం చేయాలి. ఆరు, ఏడు తరగతులలోని ప్రపంచ భౌగోళికాంశాలను బాగా చదవాలి. తొమ్మిదో తరగతిలో ఉండే ఫిజికల్‌ జాగ్రఫీ, దిగువ తరగతులలో ఉండే సముద్రశాస్త్రం, ఎనిమిదో తరగతిలోని ఆంధ్రప్రదేశ్‌ జాగ్రఫీని, పదో తరగతిలోని ఇండియన్‌ జాగ్రఫీని క్షుణ్నంగా చదవాలి. పాయింట్ల వారీగా నోట్‌ చేసుకుంటూ, మ్యాప్‌ల సాయంతో పాఠ్యాంశాలను అధ్యయనం చేయడం మంచిది.



జనరల్‌ సైన్స్‌లో ఎలా?

ప్రశ్నపత్రంలో ముఖ్యమైన భాగం జనరల్‌ సైన్స్‌. ఈ అంశాలను పాఠశాల స్థాయిలో చదివితో సరిపోతుంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీతోపాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విషయాలను చదవాలి. దిగువ తరగతులలోని పాఠ్యాంశాలు పైస్థాయిలో కాఠిన్యత పెరగడంతోపాటు రిపీట్‌ అవుతుంటాయి. వీటిని గమనిస్తూ అర్థం చేసుకుంటూ చదవాలి. పటాలు ప్రాక్టీస్‌ చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టు ఏర్పడుతుంది. వివిధ పరీక్షల్లో అడిగిన జనరల్‌ సైన్స్‌ విభాగాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రశ్నలను అంచనా వేయవచ్చు. ఇటీవల సైన్స్‌ రంగంలో వస్తోన్న పరిణామాలను పరిశీలించడం ద్వారా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయవచ్చు.



గ్రామీణ జీవన స్థితిగతులు

జనరల్‌ స్టడీస్‌లో సగం ప్రశ్నలు ఈ అంశం నుంచి వస్తాయి. ఇందులో గ్రామస్థాయిలో స్థానిక అంశాలను అధ్యయనం చేయాలి. పాలిటీ, ఎకానమీ, ఆంధ్రప్రదేశ్‌ జాగ్రఫీలను గ్రామీణ ప్రాంతాల నేపధ్యంతో ముడిపెట్టి చదవాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్‌ నిర్మాణాలు, పాలన విధానం, విధులు, తదితర అంశాలను పరిశీలించాలి. ఈ విభాగంలో గ్రామీణ ప్రాంతాల్లోని మౌలిక వసతులు, రోడ్లు, పారిశుధ్య సమస్యలు, వ్యవసాయరంగ సమస్యలు, ప్రజల జీవన స్థితిగతులు, గ్రంథాలయాలు, విద్యావిషయక అంశాల నేపధ్యంలో ప్రశ్నలు అడగవచ్చు. జాగ్రఫీని గ్రామీణ నేపధ్యంలో... వివిధ ప్రాంతాల్లో భూమి వివరాలు, అటవీ సంపద, గ్రామీణ, ఏజన్సీ ప్రాంతాల్లో ప్రజల అవసరాలు, ఇక్కట్లు, గ్రామీణ వ్యవస్థలకు అనుబంధం చేసి చదువుకోవాలి.



ఉదాహరణకు కింది ప్రశ్నలు పరిశీలించండి...



* రాష్ట్రంలో భూగర్భ జలాలు అధికంగా ఉన్న భౌగోళిక ప్రాంతం ఏది?

* రాష్ట్రంలో ఖనిజ వనరులు అధికంగా ఉన్న జిల్లా ఏది?

* ప్రాంతీయ పాలనా మండలాల్లో అధిక ప్రాధాన్యం గల వ్యవస్థ?

* స్థానిక సంస్థలకు అధిక ఆదాయం చేకూర్చే పన్నులు ఏవి?

* వాహనదారులు టోల్‌గేట్ల వద్ద చెల్లించే పన్నులు ఎవరికి చేరుతాయి?

* సాగునీటి సంఘాలకు అధ్యక్షులుగా ఎవరు ఉంటారు?

* రాష్ట్రంలో కాయగూరలు అత్యధికంగా పండే ప్రాంతం ఏది?

* ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ముఖ్య ఆదాయ వనరు ఏది?

* ఆదివాసీ భూములకు చెందిన యాజమాన్య హక్కులపై నిర్ణయం ఎవరు తీసుకుంటారు?

* రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి?

* గ్రంథాలయాలపై విధించే ఫీజులు ఎవరికి చెందుతాయి?

* గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా ఏరంగంపై ఆధారపడి ఉన్నారు?

* గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఎలా ఉంది?



గ్రామీణ జీవన విధానపై ప్రశ్నలు ప్రతి రోజూ మనం చూస్తున్న, వింటున్న, మనకు అనుభవంలోకి వచ్చే విషయాలపై ఉంటాయి. కొద్దిపాటి పరిశీలనతో వీటికి జవాబులు గుర్తించవచ్చు. గ్రామీణ వ్యవస్థల పనితీరు, విధులు, స్థితిగతులు, గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం ఉండే సమస్యలను అధ్యయనం చేయడం మంచిది.



అర్థమెటిక్‌ సామర్థ్యాలు

అభ్యర్థి ప్రాథమిక గణిత సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. మనకు పరిచయమైన సంఖ్యలు, సంఖ్యామానాలు, సగటులు, భిన్నాలు, సంభావ్యత, కాలం- దూరం, కాలం- పని, రేఖాగణితం, క్షేత్రమితి, తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. వీటికి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని గణిత అంశాలను చదివితే సరిపోతుంది. ఎక్కువ సమస్యలను సాధన చేయడం ద్వారా గణిత అంశాలపై పట్టు సాధించవచ్చు.



* లాజికల్‌ స్కిల్స్‌: ఈ విభాగంలో పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, రక్త సంబంధాలు, పజిల్‌ టెస్ట్‌, లాజికల్‌ వెన్‌ డయాగ్రామ్‌, శ్రేణీకరణ, మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడగవచ్చు. అభ్యర్థుల గణిత పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా, సమయానికి తగిన ప్రతిస్పందనలు టెస్ట్‌ చేసే విధంగా ప్రశ్నల కూర్పు ఉంటుంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా లాజికల్‌ స్కిల్స్‌పై అవగాహన పెంపొందించుకోవచ్చు.





Globe